Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 August 2024, 9:26 pm Posted by : ramakrishna

రాష్ట్ర ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా భీంగల్ వాసి

బతుకమ్మ, భీంగల్ : భీంగల్ మాజీ సర్పంచ్ గాడి రాజేశ్వర్ రావు కూతురు షాలిని శశిధర్ రాష్ట్ర ప్రభుత్వ సహాయ
న్యాయవాదిగా నియమితులయ్యారు.భీంగల్ పట్టణానానికి చెందిన షాలిని ఎం. బీ. ఏ ,ఎల్ ఎల్ బీ,ఎల్ ఎల్ ఎం ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేసి పట్టభద్రురాలు అయ్యారు.గత పది సంవత్సరాలుగా ప్రస్తుత ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి  హరినాథ్ వద్ద,ప్రస్తుత సీనియర్ కౌన్సిల్స్ ఎం. సురేందర్ రావు,సీనియర్ న్యాయవాది శ్రీనివాస్ రావు వద్ద సర్వీస్ అండ్ కార్పొరేట్, ఫ్యామిలీ, బ్యాంకింగ్ లా వంటి వివిధ రంగాల్లో ఆమె ఆరితేరి నైపుణ్యం పొందారు.