రాత్రివేళ హోటళ్ళ నిర్వాహణ కోసం ఎమ్మెల్యేకు వినతి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో హోటళ్ళ నిర్వాహణ కోసం రాత్రి 12 గంటల వరకు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ హోటల్, రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. నిజామాబాద్ నగరంలో రాత్రి 10:30కే హోటళ్ళను, రెస్టారెంట్లను మూసివేయాలని వచ్చిన ఉత్తర్వుల వల్ల తమ వ్యాపారం దెబ్బతింటుందని వారు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం లేకుండాపోతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనల ప్రకారం అధికార...