వార్డు సమస్యలు పరిష్కరించాలని వినతి

ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని రెండవ వార్డు లో గల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ మహేష్ కు కాలనీ వాసులు వినతి పత్రం అందజేశారు. కాలనీ లో గల మురికి కాలువలు సక్రమంగా లేవని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.అలాగే నీటి సమస్య కూడా ఉందని, రాబోయే వేసవి ని దృష్టిలో ఉంచుకుని, నీటి కొరకు ఇబ్బందులు లేకుండా చూడాలని వినతి పత్రం లో కోరారు.