. డిప్యూటీ సీఎం భట్టికి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వినతి
హైదరాబాద్, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయాలని కోరుతూ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఉప ముఖ్యమంత్రిని హైదరాబాద్ లో ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై మాట్లాడారు. ఎల్లా రెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి పెండింగ్ బిల్లులను త్వరగా విడుదల చేయాలని కోరారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి లింగంపేట్ మండలంలోని మోతే గ్రామంలో భూమిని సిద్ధం చేశామని తెలిపారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వినతిపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు.