Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 August 2024, 6:58 pm Posted by : ramakrishna

ఆర్మూర్ లో కత్తిపోట్ల కలకలం

  • మద్యం షాప్ వద్ద తాగిన మైకంలో గలాటా
  • ఒకరిపై ఒకరు కత్తులతో దాడి
  • భయాందోళనకు గురైన స్థానికులు
  • క్షత గాత్రులను ఆసుపత్రికి తలలింపు

బతుకమ్మ ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్ చౌరస్తా లో మంగళవారం సాయంత్రం దారుణం జరిగింది. తాగిన మైకంలో ఒకరినొకరు ఘర్షణ పడకు కత్తులతో పరుచుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. పెర్కిట్ చౌరస్తాలోని ఉన్న ఓ మద్యం దుకాణం వద్ద ఇద్దరూ తాగుబోతులు వ్యక్తిగత కారణాల ద్వారా ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. దీంతో స్థానికులు వెంటనే క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జిల్లాలో ఇలాంటి ఘటనలు ఎక్కడో చోట మద్యం మత్తులో మద్యం దుకాణాల వద్ద ఘర్షణలు చేసుకోవడం పరిపాటిగా మారింది. అయితే నేరాలు నియంత్రణ చేసే పోలీసులు మాత్రం ఎలాంటి గొడవలు జరుగుతున్నాయి, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని మాత్రం మద్యం షాప్ యాజమాన్యాలు ఇచ్చే లంచాలకు అలవాటు పడి అసలు వైన్ షాప్ ల వద్ద ఏం జరుగుతుందో కూడా తనిఖీలు చేయలేని పరిస్థితి ఉందంటే పోలీసుల తీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. అయినప్పటికీ పోలీసుల భద్రత వ్యవస్థ ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.