అన్నారంలో అరుదైన చేప లభ్యం

నందిపేట్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా  డొంకేశ్వర్ మండలం అన్నారం గ్రామంలో గుండ్ల భోజన్న అనే మత్స్యకారుడి వలకు అరుదైన చేప చిక్కింది సుమారు 5 అడుగుల పొడువున్న జిమ్మ వలకు చిక్కడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఇటువంటి చేపలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే లభిస్తాయని భోజన్న తెలిపారు. నందిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రి యజమాని రాజు ఈ చేపను కొనుగోలు చేశారు.