Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 October 2024, 5:55 pm Posted by : ramakrishna

మెడికల్ కళాశాల విద్యార్థినికి అరుదైన పురస్కారం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ 4వ సంవత్సరం చదువుతున్న ఎన్ లావణ్యకు ఫిబ్రవరి 2024లో జరిగిన పరీక్షలో తెలంగాణ కే ఎన్ ఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో ఈ ఎన్ టీ సబ్జెక్టులో మొదటి స్థానాన్ని సాధించి బంగారు పతకాన్ని అందుకున్నట్లు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన సౌత్ జోన్ ఏఒఐ(ఈఎన్టీ) సదస్సు లో ఆమెకు 20 అక్టోబర్ 2024న పతకాన్ని అందుకున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం లోనే మొదటిసారిగా ఈ బంగారు పతకం జిజిహెచ్ విద్యార్థినికి రావడం గర్వంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం జి జి హెచ్ లోని సూపర్ ఇండెంట్ ఛాంబర్ లో మెడికల్ విద్యార్థినిని సన్మానించారు. కార్యక్రమంలో డా. హరీష్ స్వామి, ఇంఛార్జ్ విభాగాధిపతి, అసోసియేట్ ప్రొఫెసర్, డా. కాత్యాయిని, అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితరులు పాల్గొన్నారు.