Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 September 2024, 6:52 pm Posted by : ramakrishna

విద్యార్థులలో ప్రశ్నించే తత్వం అలవర్చాలి

– జె.వి.వి. జిల్లా గౌరవ అధ్యక్షులు విజయ ఆనంద రావు

బతుకమ్మ,నవీపేట్ : ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చాలని, ఉపాధ్యాయులు విద్యార్థులకు శాస్త్రీయబద్దంగా బోధన చేయాలని జన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు విజయా ఆనంద రావు ఉపాధ్యాయులు సూచించారు. మండలం లోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్, స్కాలర్స్, ప్రభుత్వ బాలుర, బాలికల పాఠశాలలలో జె.వి.వి ఆధ్వర్యంలో లీపు సంవత్సరం భావన, విధానం మరియు మూఢ నమ్మకాల పై ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టర్ పై లీపు సంవత్సరం ఏర్పాటు విధానం వివరించారు. మ్యాజిక్ ప్రదర్శన చేస్తూ మూఢ విశ్వాసాల పై మరియు సైన్స్ యొక్క ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ కరెస్పాండెంట్ హన్మాండ్లు, ఉపాధ్యాయులు, జె.వి.వి. నాయకులు రాజశేఖర్, భూమారావు, చంద్ర శేఖర్, జన చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు డి.సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.