Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 October 2024, 12:22 pm Posted by : ramakrishna

ప్రారంభమైన బహిరంగ విచారణ

నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఐదవ నియంత్రణ కాలానికి సంబంధించిన బహిరంగ విచారణ ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉత్తర మండల విద్యుత్ పంపణీ వ్యవస్థ ఆధ్వర్యంలో 2024-25 నుంచి 2028-29 వరకు డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం యొక్క సమగ్ర ఆదాయం, సీలింగ్ చార్జిలు, రిటైల్ సప్లయ్ వ్యాపారంకు సంబంధించిన విద్యుత్ సరఫరా  చార్జీలు, సబ్సిడీ సబ్ చార్జీలపై గురువారం విచారణ ప్రారంభమైంది. ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ శ్రీరంగారావు, టెక్నికల్ అడ్వయిజర్ మనోహర్ రాజు, ఫైనాన్స్ సభ్యులు బండారి కృష్ణయ్యలతో పాటు ఇతర  సభ్యులు బహిరంగ విచారణను ప్రారంభించారు. ఈ సందర్భంగా సూచనలు , సలహాలు స్వీకరించారు.

A public hearing has begun