సాంస్కృతిక సారథి చైర్మన్ ను సన్మానించిన కవి, గాయకుడు

బతుకమ్మ, మాచారెడ్డి: తెలంగాణ సాంస్కృతిక సారథి డాక్టర్ వెన్నెల ను మాచారెడ్డి మండల కవి, గాయకుడు ఐండ్ల రాము మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా ఐండ్ల రాము మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం నుంచి సుదీర్ఘ విప్లవ పోరాటం చేసి, మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తూటాలకు సైతం వెరవని ప్రజాయుద్ధనౌక గద్దర్ అన్న కూతురు వెన్నెల కు ఈ పదవి ఇచ్చి ప్రభుత్వం సాంస్కృతిక కళా రంగానికి ప్రభుత్వం వన్నెతెచ్చిందన్నారు.