Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 December 2024, 9:29 pm Posted by : ramakrishna

జాతీయస్థాయి క్రీడల్లో ఆర్ బి వి ఆర్ ఆర్ కు చోటు

నిజామాబాద్ సిటీ బతుకమ్మ :  హైదరాబాద్లోని బెల్లంపల్లిలో ఈనెల 24, 25, 26 తేదీలలో జరిగిన సాఫ్ట్ బేస్ బాల్ సబ్ జూనియర్ క్రీడల్లో జిల్లా కేంద్రంలోని ఆర్ బి వి ఆర్ ఆర్ పాఠశాలకు చెందిన 9, 10 గ్రేడ్ కు చెందిన విద్యార్థులు జాతీయస్థాయిలో ఆడేందుకు చోటు దక్కించుకున్నారని పాఠశాల నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ బేస్ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ వారు నిర్వహించిన ఈ క్రీడలు  జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో క్రీడాకారులు రాణించేందుకు గొప్ప అవకాశమన్నారు. ఈ సందర్భంగా తమ పాఠశాలకు చెందిన క్రీడాకారులు రెండవ స్థానంలో నిలవడం సంతోషకరమన్నారు. అలాగే ఈ క్రీడల్లో మంచి శిక్షణను ఇచ్చిన కోచ్, అదేవిధంగా విద్యార్థులకు ఆర్ బి వి ఆర్ ఆర్ పాఠశాల ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ జగత్ రెడ్డి, స్పోర్ట్స్ డైరెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి, సొసైటీ మేనేజ్మెంట్, ప్రెసిడెంట్, సెక్రటరీ విద్యార్థులను,  క్రీడాకారులను అభినందించారు.