ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ప్రయోగాత్మక సర్వేను పక్కాగా జరిపించాలి 

 కలెక్టర్లతో మంత్రి పొంగులేటి, సీ.ఎస్ శాంతికుమారి వీ.సీ ద్వారా సమీక్ష  నిజామాబాద్, బతుకమ్మ: రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ కోసం ప్రయోగాత్మకంగా ఈ నెల 3 వ తేదీ నుండి పైలెట్ ప్రోగ్రామ్ కింద చేపట్టనున్న ప్రయోగాత్మక సర్వేను పక్కాగా జరిపించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే, నగరాలు, పట్టణ ప్రాంతాల విస్తరణకై ప్రతిపాదనలు, భూముల క్రమబద్దీకరణ (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల సత్వర పరిష్కారం, డబుల్ బెడ్...