Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 April 2025, 6:32 pm Posted by : ramakrishna

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కృషి చేసిన వ్యక్తి

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలం శేట్ పల్లి గ్రామంలోని మాదిగ సంఘం ఆధ్వర్యంలో శనివారం డా॥ బాబు జగ్జీవన్ రావు 118 జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశాడని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మోర్తాడ్ మండల ధర్మ సమాజ్ పార్టీ  అధ్యక్షులు ఉమేష్ మహారాజ్, ఉపాధ్యక్షులు రాజు, ప్రధాన కార్యదర్శి పాలెపు రాము, మండల నాయకులు నర్సయ్య, కులపెద్ద గంగారం,గ్రామ నాయకులు రవీంధర్ గ్రామDSP అధ్యక్షులు సాగర్, శ్రీనివాస్, దేవేందర్, అభిలాష్, మహేష్, సతీష్,  సాయిలు, నరేష్ నిలేష్, అజయ్ ప్రణీత్ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.