Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 October 2025, 6:18 pm Posted by : ramakrishna

పార్టీ బలోపేతం కోసం పాటుపడే వ్యక్తిని అధ్యక్షుడిగా ఎంపిక

  • ఎల్లారెడ్డి  ఎమ్మెల్యే మదన్ మోహన్

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ ప్రారంభమయిందని..పార్టీ బలోపేతం కోసం పాటుపడే వ్యక్తిని అధ్యక్షుడిగా ఎంపిక చేయడం జరుగుతుందని ఎల్లారెడ్డి  ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి (డీసీసీ ప్రెసిడెంట్ ) ఎంపిక ప్రక్రియలో భాగంగా బుధవారం ఎల్లారెడ్డి మండల కేంద్రంలో  స్నేహ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసీసీ అబ్జర్వర్, రాజ్యసభ ఎంపీ రాజ్ పాల్ ఖరోలా ను ఎమ్మెల్యే మదన్ మోహన్ స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు.   “ఓట్ చోర్ గడ్డి చోడ్” రాహుల్ గాంధీ పోరాటానికి ప్రజా మద్దతుగా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ మండల అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

A person who will work to strengthen the party will be elected as the president