ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తికి మూడేళ్ల జైలుశిక్ష
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నేరపూరిత ఉద్దేశ్యంతో ఒకరి ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించి,ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసి,మహిళను గాయపరచి,కులంపేరుతో దూషించిన ముద్దాయి కొట్టొల్ల కార్తిక్ కు ఆయా నేరాలలో జైలుశిక్షలు విధిస్తు నిజామాబాద్ షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలపై అత్యాచారాల విచారణ న్యాయస్థానం స్పెషల్ జడ్జి టి. శ్రీనివాస్ తీర్పు బుధవారం చెప్పారు.అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రోడ్ ప్రాంతంలో నివాసం ఉండే కార్తీక్ ,రామదాసు అనే వ్యక్తి తనకు మూడు...