Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 October 2024, 12:03 pm Posted by : ramakrishna

మద్యం మత్తులో డయల్ 100 కి కాల్ చేసిన వ్యక్తికి రెండు రోజులు జైలు శిక్ష

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

మద్యం మత్తులో డయల్ 100 కు కాల్ చేసి న్యూసెన్స్ చేసిన వ్యక్తికి న్యాయస్థానం రెండు రోజుల జైలు శిక్ష విధించింది. మూడవ టౌన్ ఎస్ఐ మహేష్ కథనం ప్రకారం.. ఈ నెల 7 న గౌతమ్ నగర్ కు చెందిన కరకపట్ల రాజేష్ అతిగా మద్యం సేవించి  డయల్ 100 కి కాల్ చేసి న్యూసెన్స్  అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇందుకుగాను  మంగళవారం రాజేష్ కు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టగా జడ్జీ రెండు రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు. ప్రజలు 100 డయల్ ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించుకోవాలని, అనవసరంగా కాల్ చేస్తే తగిన శిక్ష వేయబడుతుందని తెలిపారు.