Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 September 2024, 4:16 pm Posted by : ramakrishna

మద్యం మత్తులో డయల్ 100 కి ఫోన్ చేసిన వ్యక్తికి ఒకరోజు జైలు

బతుకమ్మ, నిజామాబాద్ క్రైం : మద్యం మత్తులో అవసరం లేకున్న డయల్ 100 కు పోన్ చేసిన మందుబాబుకు న్యాయస్థానం ఒకరోజు జైలు శిక్ష విధించింది. నిజామాబాద్ 2 వ టౌన్ ఎస్ ఐ యాసిర్ అరాఫత్ కథనం ప్రకారం… నరగంలోని బాబన్ సహాబ్ పహాడ్ కి చెందిన నదీం అను వ్యక్తి రెండవ పోలీస్ స్టేషన్ పరిధిలో కి వచ్చి న్యాలకల్ చౌరస్తా దగ్గర దారి వెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి దగ్గర ఫోన్ తీసుకొని అవసరం లేకున్నా అనవసరంగా 100 నెంబర్ కి కాల్ చేశారు. పోలీస్ అవసరం ఉందని తాగిన మైకంలో చెప్పగా పోలీసులు అతని లొకేషన్ తెలుసుకొని అతని దగ్గరికి వెళ్లి ప్రాబ్లం ఏముందని అడగగా ఊరికే చేశాను అని చెప్పడం జరిగినది. తాగిన మత్తులో 100 నంబర్ కి ఫోన్ చేసి పోలీసులను తప్పుదోవ పట్టించిన వ్యక్తి పై కేసు నమోదు చేసి మంగళవారు స్పెషల్ జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా నదీంకు ఒక రోజు జైలు శిక్ష విధించడం విధిస్తు జడ్జీ తీర్పు చేప్పారు.