Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 9:38 pm Posted by : ramakrishna

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

మెండోరా, బతుకమ్మ :

 

మెండోరా మండలంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై సుహాసిని తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పోచంపాడ్ గ్రామానికి చెందిన నరసయ్య టీవీఎస్ ఎక్స్‌ ఎల్ వాహనంపై ప్రయాణిస్తుండగా, దూదిగాం గ్రామ శివారులోని సబ్‌స్టేషన్ సమీపంలో ఎన్ఎస్–44 జాతీయ రహదారిపై హర్యానాకు చెందిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరసయ్య తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మార్గమధ్యలోనే ఆయన మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మెండోరా ఎస్సై సుహాసిని తెలిపారు.