Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 October 2024, 7:38 pm Posted by : ramakrishna

కడుపునొప్పి భరించలేక ఒకరి ఆత్మహత్య

ఎల్లారెడ్డి, బతుకమ్మ :  కడుపు నొప్పి భరించలేక యువకుడు  ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్లారెడ్డి మండలంలోని దావల్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నిజాంసాగర్ మండలం నర్వ గ్రామానికి చెందిన న నీరుడు సతీష్ తన భార్య పిల్లలతో పాటుగా ఈ నెల తేదీ 27న ఎల్లారెడ్డి మండలం దావల్ మల్కాపల్లి గ్రామం లోని తన అత్తగారింటికి వచ్చాడు. అక్కడ రాత్రి తిని పడుకున్న తర్వాత ఉదయం సతీష్ భార్య  పుష్ప లేచి చూసేసరికి తన భర్త కనిపించకపోవడంతో గ్రామంలో చుట్టుపక్కల వెతికి చూడగా గ్రామంలోని మమ్మాయి రవీందర్ పొలంలో గల చింత చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి  నిరుడి సంగయ్య తన కొడుకు గత కొన్ని రోజుల నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్నాడని తెలిపారు.  అది తగ్గకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు అని అతని ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.