బీడీ కార్మికులకు రూ.4వేల పెన్షన్ అమలు చేయాలి
తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ కామారెడ్డి, బతుకమ్మ : షరతులు లేకుండా బీడీ కార్మికులకు రూ.4వేల పింఛన్ అమలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం కొత్త బస్టాండ్ వద్ద గల సి ఎస్ ఐ ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం భారీ ప్రదర్శన కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించారు. ఈ...