మహిళ మెడలోనుంచి గోలుసు చోరి
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలో గోలుసు దోంగలు రెచ్చిపోతున్నారు. నగరంలోని సుభాష్ నగర్ లో గల రాదాక్రిష్ణ థియేటర్ వద్ధ కిరాణ దుకాణం నడుపుతున్న రజనీ అనే మహిళ మెడలోనుంచి 2 తులాల బంగారు చైన్ ను లాక్కోని పరారీ అయ్యారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. బైక్ పై వచ్చిన అగంతుకుడు దుకాణంలో గిరాకీ చేస్తున్నట్లు మాటల్లో పెట్టి చైన్ లాక్కోని పరారీ అయ్యాడు. భాధితురాలు స్థానిక పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా పోలిసులు గాలింపు చర్యలు చెపట్టారు....