Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 January 2026, 7:40 pm Posted by : ramakrishna

చైనా మాంజాతో తృటిలో తప్పిన ప్రమాదం

. . . రైతు గొంతు కోసిన మాంజ

 

నవీపేట్, బతుకమ్మ :

 

వ్యవసాయ పనులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్న రైతు గొంతును చైనా మాంజ కోసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. మంగళవారం  నవీపేట మండలంలోని నాళేశ్వర్ గ్రామానికి చెందిన రైతు ఆర్మూర్ మణికాంత్ పొలం నుంచి గడ్డిమోపులతో బైక్ పై తీసుకుని వెళ్తుండగా గొంతుకు చైనా మాంజ తగిలి తీవ్ర గాయమైంది. మణికాంత్ స్పీడ్ తక్కువ నడుపడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం వలన గొంతు భాగంలో గాయం జరిగింది. హుటాహుటిన నందిపేట్ లో  ప్రైవేటు ఆసుపత్రికి కుటుంబ సభ్యులు గ్రామస్తులు తరలించారు.

A narrow escape with Chinese manja