నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 50 సంవత్సరాల నాటి అతిపెద్ద వృక్షం నేల కూలింది. ఒకేషనల్ కాలేజీలో తరగతులు జరుగుతుండగా 50 మంది విద్యార్థులు విద్యార్థులు క్లాస్ లో ఉండగా ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. పెద్ద రావి చెట్టు తరగతి గదుల రేకులపై పడడంతో రేకులు ధ్వంసమై పెంకులు కిందపడ్డాయని ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలేద్ తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ప్రాణా నష్టం జరగలేదని, రేకులు ధ్వంసమైనట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
