Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 November 2024, 1:29 pm Posted by : ramakrishna

మండలి ఎన్నికల నేపథ్యంలో గాంధీభవన్ లో సమావేశం

ఎల్లారెడ్డి, బతుకమ్మ: శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ గాంధీ భవన్ లో ప్రత్యేక చర్చ కార్యక్రమం ఏర్పాటు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మదన్ మోహన్ రావు పలు అంశాలపై మాట్లాడారు. ఏఐసీసీ ఇన్ చార్జి దీపాదాస్ మున్షి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కొండ సురేఖ, కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.