నమ్మించి కోట్లలో నిండా ముంచిన మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు

లబోదిబోమంటున్న బాధితులు బతుకమ్మ నిజామాబాద్ సిటీ - నిజామాబాద్ నగరానికి చెందిన ఓ మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు రూ.కోట్లతో ఉడాయించాడు. నాందేవ్వాడ కేంద్రంగా ఏజెన్సీ నడిపిస్తున్న సదరు వ్యక్తి కుటుంబీకులతో కలిసి గాయత్రీనగర్లో నివాసం ఉంటున్నాడు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన సదరు వ్యక్తి ఏళ్లుగా మెడికల్ ఏజెన్సీ నిర్వహిస్తుండడంతో పాటు నెలనెలా రూ. కోట్లలో టర్నోవర్ జరుగుతుండడంతో పలువురు ఇతనికి పెద్దమొత్తంలో అప్పులిచ్చారు. ఈ జాబితాలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాతో పాటు కరీంనగర్, హైదరాబాద్, విజయవాడకు చెందిన బడా ఏజెన్సీల నిర్వాహకులు, వైద్యులు, రియల్ఎస్టేట్...