ఆర్మూర్, బతుకమ్మ : విశ్వసనీయం సమాచారం మేరకు ఆర్మూర్ లోని మామిడిపల్లి చౌరస్తా నుండి హైదరాబాద్ వెళుతున్న మార్గంలో ఎక్సెస్ ఇన్స్పెక్టర్ స్టీఫెన్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు నిర్వహించారు. గంజాయి రవాణా చేస్తున్న మహమ్మద్ వహీద్ ను ఆ ర్మూర్ లో అరెస్టు చేసి అతని వద్ద నుండి ఒక్క కిలో 1-100 గ్రాముల ఎండు గంజాయి, పల్సర్ వాహనం, మొబైల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రమౌళి, సందీప్, శ్రీనివాస్, సాగర్ నగేష్, సాయిబాబా, మోహన్, ధర్మేందర్, గంగాధర్ హెడ్ కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు.