ఆర్మూర్, బతుకమ్మ:
ఆర్మూర్ లో ఓక వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కోట్టి చంపారు. బుదవారం రాత్రి జరిగిన ఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని 63 వ జాతీయ రహదారిలో గల కమల నెహ్రు కాలనీ హజారి ఫంక్షన్ హాల్ వద్ద సాయిలు ( 46) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి దారుణంగా కొట్టి చంపడం జరిగింది. 63వ జాతీయ రహదారి పక్కన చిత్తు కాగితాలు మేరుకొని జీవించే సాయిలును ఎవ్వరు హత్య చేసి ఉంటారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్మూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను తెలుసుకుంటున్నారు.