Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 August 2025, 1:59 pm Posted by : ramakrishna

పైప్​లో ఇరుక్కుని ఓ వ్యక్తి మృతి

నస్రుల్లాబాద్​ మండలం దుర్కి శివారులో ఘటన

మృతుడు దేశాయిపేట్ వాసి

బాన్సువాడ, బతుకమ్మ : జాతీయ రహదారిపై కల్వర్టు వద్ద నీరు ప్రవహించేలా ఏర్పాటు చేసిన పైప్​లో ఇరుక్కుని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నస్రుల్లాబాద్​ మండలంలోని దుర్కి శివారులో సోమవారం చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నస్రుల్లాబాద్​ మండలం దుర్కి శివారులో కల్వర్టు వద్ద చేపలు పట్టేందుకు దేశాయిపేట్ గ్రామానికి చెందిన రాజు(28) వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ రోడ్డు పనుల్లో భాగంగా అమర్చిన పైప్​లో రాజు ఇరుక్కున్నాడు. దీంతో బయటపడే అవకాశం లేకపోవడంతో నీట మునిగి మృతి చెంది ఉంటాడని స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.