బంగాళాఖాతంలో భారీ తుఫాన్
తెలుగు రాష్ట్రాలకు 7 రోజులు భారీ వర్షాలు హైదరాబాద్, బతుకమ్మ : నైరుతీ రుతుపవనాలు జోరుమీదున్నాయి. నైరుతీ రుతుపవనాలు దూసుకువచ్చేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని భారత వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇప్పుడు నైరుతీ రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాతాలకు రానున్నాయి. అలాగే శ్రీలంక కింద ప్రాంతం, మాల్దీవులు, బంగాళాఖాతం దక్షిణ ప్రాంతం, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రం అంతటా నైరుతీ రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. రానున్న రెండు మూడు రోజుల్లో ఇవి మధ్య బంగాళాకాతంలోకి కూడా వస్తాయని ఐఎండీ తెలిపింది. ఆగ్నేయ...