- ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అనారోగ్యంతో అప్పుల పాలైన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తాయని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ లో గురువారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గంలోనీ పలు కాలనీల లోని బాధితులకు సీఎం సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేయించడం జరిగిందని అన్నారు. పేదలకు సహాయంగా అండగా నియోజకవర్గ ప్రజల మంచి మాత్రమే కోరుకుంటామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు అర్హులకు నిరంతరంగ అందిస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేస్తున్నామని అన్నారు.
