Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 February 2025, 1:06 pm Posted by : ramakrishna

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

పలువురికి గాయాలు

దేవునిపల్లి పీఎస్ పరిధిలో ఘటన

కామారెడ్డి, బతుకమ్మ :  ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో పలువురికి గాయలయ్యాయి. ఈఘటన శుక్రవారం కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.  వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డికి వెళ్తుండగా టేక్రియాల్  బ్రిడ్జి వంతెన చివరన యూటర్న్ తీసుకుంటుంది. ఈక్రమంలో కామారెడ్డి నుంచి నిజామాబాద్ కు వస్తోన్న లారీ ఢీకొంది. ఈప్రమాదంలో 8మంది గాయపడ్డారు. క్షత్రగాత్రులను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారమందుకున్న దేవునిపల్లి పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

A lorry collided with an RTC bus
A lorry collided with an RTC bus