జనవాసంలో ప్రత్యక్షమైన మొసలి

బతుకమ్మ,ఏర్గట్ల: తాళ్ల రాంపూర్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున మొసలి గ్రామంలో ప్రత్యక్షమైంది. గ్రామానికి చెందిన ఒకరు కాల కృత్యాల కోసం బయటకు వచ్చారు. కుక్కలు అరవడం గమనించి అటువైపుగా వెళ్లి చూసాడు. మొసలిని చూసి కుక్కలు మొరవడంతో  ప్రాణ భయంతో వెంటనే గ్రామ ప్రజలకు సమాచారం అందించాడు. గ్రామస్తులు విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు,స్థానిక పోలీస్ అధికారులకు తెలిపారు. అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానిక ఎస్సై రాము ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ శివయ్య,కానిస్టేబుల్, ప్రవీణ్ గౌడ్, పోలీస్ స్టేషన్ సిబ్బంది,ఫారెస్ట్ ఆఫీసర్ వరుణ్,సురేష్...