Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 February 2025, 6:37 pm Posted by : ramakrishna

జనవాసంలో ప్రత్యక్షమైన మొసలి

బతుకమ్మ,ఏర్గట్ల: తాళ్ల రాంపూర్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున మొసలి గ్రామంలో ప్రత్యక్షమైంది. గ్రామానికి చెందిన ఒకరు కాల కృత్యాల కోసం బయటకు వచ్చారు. కుక్కలు అరవడం గమనించి అటువైపుగా వెళ్లి చూసాడు. మొసలిని చూసి కుక్కలు మొరవడంతో  ప్రాణ భయంతో వెంటనే గ్రామ ప్రజలకు సమాచారం అందించాడు. గ్రామస్తులు విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు,స్థానిక పోలీస్ అధికారులకు తెలిపారు. అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానిక ఎస్సై రాము ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ శివయ్య,కానిస్టేబుల్, ప్రవీణ్ గౌడ్, పోలీస్ స్టేషన్ సిబ్బంది,ఫారెస్ట్ ఆఫీసర్ వరుణ్,సురేష్ లు అలాగే ఫారెస్ట్ సిబ్బంది,గ్రామస్తుల సహకారంతో స్థానికులకు ఎలాంటి అపాయం జరగకుండా మొసలిని బంధించారు. బందించిన మొసలిని అధికారులు శ్రీరాం సాగర్ లో వదిలారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ గ్రామ సమీపంలోని  చెరువులో నుండి గ్రామంలోకి గతంలో కూడా ఇలాంటి మొసలి ఒకటి రావడంతో ఎంతో భయభ్రాంతులతో ప్రాణ భయంతో జీవనం కొనసాగిస్తున్నామన్నారు. మళ్లీ అలాంటి మొసలి గ్రామంలోకి రావడంతో ఎంతో ప్రాణ భయంతో ఉన్నామని అన్నారు. మూడు గంటల సమయంలో కూడా ఫోన్ చేసిన వెంటనే ఫారెస్ట్ అధికారులు స్థానిక పోలీసులు వెంటనే స్పందించడం పట్ల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు స్పందించి తమ గ్రామంలోని చెరువులలో మొసల్లు ఉన్నట్లయితే వాటిని పట్టుకొని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో వదిలివేయాలని గ్రామ ప్రజలు కోరారు.

A living crocodile