టీ ఎస్ ఎస్ ఎస్ వి. ఉమ్మడి జిల్లాల కన్వీనర్ ఘనపూరం దేవేందర్
నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ :
తొలిదశ ఉద్యమ కాలంలో విస్మరించబడిన సాహిత్యం, మలిదశ ఉద్యమ కాలంలో వెల్లువలా వచ్చిన సాహిత్యాన్ని భద్రపరిచి, ముందు తరాలకు అందుబాటులో ఉంచెందుకు గాను తెలంగాణ రాష్ట్ర సాధన సాహిత్య వేదిక ఆధ్వర్యంలో సంకలనం తీసుకువస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర సాధన సాహిత్య వేదిక నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల కన్వీనర్ ఘనపురం దేవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు సంబంధించిన సాహిత్య వేత్తలు ఉద్యమ కాలంలో తాము రాసిన సాహిత్యం, వివిధ సంస్థల వెలువరించిన సంకలనాలు, వ్యాసాలు, వివిధ పత్రికల్లో ప్రచురితమైన రచనల వివరాలను, వివిధ ఉద్యమ సందర్భాలకు సంబంధించిన కీలకమైన అంశాలను trssnzb@gmail.com నకు పంపాలని ఆయన కోరారు. ముందు తరాలకు తెలంగాణ ఉద్యమ చరిత్రను, ముఖ్యంగా సాహిత్య చరిత్రను అందుబాటులో ఉంచే ఈ బృహత్తర కార్యక్రమంలో సాహితీవేత్తలు అందరు భాగస్వాములు కావాలని ఆయన కోరారు.