నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా అడవిలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. సిరికొండ మండలం తాటిపల్లి అటవి ప్రాంతంలో పెద్దపులి సంచరించినట్లు స్థానికులు గుర్తించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. శుక్రవారం ఆర్మూర్ ఎఫ్ డి ఓ భవానీ శంకర్, సిరికొండ ఇంచార్జ్ ఎమ్ ఆర్ ఓ రవిందర్ అటవి అధికారులు తాటిపల్లి అడవిలో పులి సంచరించిన ప్రాంతంలొ పరిశీలించారు. ఈ సందర్భంగా అటవి అధికారులు పాదముద్రలను పరిశీలించి పులి సంచారం నిజమేనని తెల్చారు. ఆదిలాబాద్ అటవీ ప్రాంతం నుంచి పులి వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతంలో నిజామాబాద్ జిల్లాలో పులుల సంచారం ఉండేది. చివరగా 1997 లొ ఒకసారి, 2000 సంవత్సరంలో రెండోసారి పులి సంచరించినట్లు అటవి అధికారులు తెలిపారు. సిరికోండ అటవి ప్రాంతంలో పులి సంచారం స్థానికులలో ఆందోళన కలిగిస్తుంది. జిల్లాలో ఆటవీ ప్రాంతం రోజు రోజుకు క్షిణించి పోతుండగా చిరుత పులి , ఎలుగు బంట్లు లాంటి వణ్య ప్రాణుల సంచారం ఉంది. కాని తొలిసారి రెండు దశాబ్దాల తర్వాత పులి సంచారం వాస్తవమేనని ఆర్మూర్ ఎఫ్ డి ఓ భవానీ శంకర్ తెలిపారు. పాదముద్రల ద్వారా అంచనా వేసినట్లు ఇటివల కాలంలో రాజన్న సిరిసిల్ల అటవి ప్రాంతంలో పులి కదలికలు ఉన్నట్లు సమాచారం ఉందని తెలిపారు.
