కార్మిక శాఖ మంత్రిని వెంటనే నియమించాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కార్మిక మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ట్రేడ్ యూనియన్స్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ముత్తెన్న, ఎం.సుధాకర్ లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతున్నా, ఇప్పటికీ కార్మిక మంత్రిని నియమించలేదన్నారు. కార్మిక శాఖను ముఖ్యమంత్రి వద్దే ఉంచుకోవడంతో కార్మికుల సమ్మస్యలు, వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం...