అక్రమ వలసలపై కీలక ప్రకటన

రాజ్యసభలో వెల్లడించిన విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ డిల్లీ, బతుకమ్మ :  అక్రమ వలసలపై రాజ్యసభలో భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ గురువారం కీలక ప్రకటన చేశారు. అక్రమ వలసదారుల తరలింపు అనేది కొత్తదేమీ కాదని పేర్కొన్నారు.  ఏళ్లనుంచి అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ జరుగుతూనే ఉందన్నారు. అన్ని దేశాల అక్రమ వలస దారులను అమెరికా వెనక్కి పంపించేస్తోందన్నారు.  తమ దేశస్తులు విదేశాల్లో చట్టవిరుద్ధంగా ఉంటే స్వదేశాలకు రప్పించడం బాధ్యత అని జైశంకర్ వ్యాఖ్యనించారు.