రాష్ట్ర విభజన అంశాలపై కీలక సమావేశం

ఉమ్మడి ఏపీ విభజన అంశాలపై డిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో కీలక సమావేశం సోమవారం జరిగింది. ఏపీ, తెలంగాణ సీఎస్ లు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఇరు రాష్రాల మధ్య ఇంకా పరిష్కారం కాని ప్రధానాంశాలపై అధికారులు చర్చిస్తున్నారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై భేటీలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.