Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 January 2025, 11:28 am Posted by : ramakrishna

ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసిన జూనియర్ అసిస్టెంట్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

వ్యవసాయ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మహిళ ఉద్యోగిని ఫినాయిల్ తాగి ఆత్మహత్య యత్నం చేసింది. ఈ సంఘటన మంగళవారం  ఉదయం వెలుగు చూసింది. నిజామాబాద్ నగరానికి చెందిన మహిళ ఉద్యోగిని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రాంతంలో వ్యవసాయ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. ఇటివల కాలంలో అక్కడి నుంచి బదిలీ, డిప్యూటేషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులను కలిసి తనను సోంత ప్రాంతానికి ఎలాగైనా బదిలీ చేయాలని మొరపెట్టుకున్నారు. అధికారులు, సంఘం నేతల చుట్టూ తిరిగి విసిగి వేసారి పోయిన మహిళా ఉద్యోగిని ఆత్మహత్య యత్నం చేయగా కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నట్లు సమాచారం.