Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 November 2025, 5:04 pm Posted by : ramakrishna

హీడ్మా ఎన్కౌంటర్ పై సుప్రీం కోర్ట్ జడ్జీతో న్యాయవిచారణ జరిపించాలి

  • న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మావోయిస్టు అగ్ర నేత హీడ్మా ఎన్కౌంటర్ ఫై సుప్రీం కోర్ట్ జడ్జీతో న్యాయ విచారణ జరిపించాలని నిజామాబాద్ జిల్లా కేంద్రం లొ ఎన్టార్ చౌరస్తా వద్ద న్యూడేమోక్రసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూడేమోక్రసి జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ సిపిఐ(మావోయిస్టు) పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎన్కౌంటర్ల పేరిట చంపడాన్ని సిపిఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ఆపరేషన్ కగార్ పేరిట సిపిఐ(మావోయిస్టు) నాయకులు, కార్యకర్తలను, ఆదివాసులతో సహా లక్ష్యంగా చేసుకొని, చంపడాన్ని ఒక విధానంగా కొనసాగిస్తుందని తెలిపారు. ఈ విధంగా చేపట్టే కార్యక్రమాల్లో రాజ్యాంగ పరమైన, చట్టపరమైన నియమాలను కేంద్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేస్తోందని అన్నారు. ఈ విధంగా 2025 నవంబర్ 18న సిపిఐ(మావోయిస్టు) నాయకుడు మడావి హిడ్మాతో సహా ఆరుగురిని ఎన్కౌంటర్ పేరిట ఆంధ్ర ప్రదేశ్ లోని మారేడుమిల్లి ప్రాంతంలో చంపేశారని మండిపడ్డారు. నవంబర్ 19న మావోయిస్టు పార్టీకి చెందిన మరో ఏడుగురిని రంపచోడవరం ప్రాంతంలో చంపివేశారన్నారు. ఈ ఎన్కౌంటర్లన్నీ బూటకమని పౌర హక్కులు, ప్రజాస్వామిక హాక్కుల సంఘాలు ప్రకటించాయని తెలిపారు. ఈ ఎన్ కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. ఎన్కౌంటర్లను ఆపి ఆపరేషన్ కగారును రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య, నగర్ డివిజన్ కార్యదర్శులు పరుచూరి శ్రీధర్, నీలం సాయిబాబా, హెచ్ఆర్ఎఫ్ జిల్లా కార్యదర్శి గెంటియాలా రమేష్, పార్టీ నాయకులు, జేపీ గంగాధర్, మల్లికార్జున్, దిశెట్టి సాయి రెడ్డి, శివకుమార్, గంగాధర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

A judicial inquiry should be held with a Supreme Court judge on the Heedma encounter.