కాళ్లకు సంకెళ్లు వేసిన వ్యక్తితో వెట్టిచాకిరీ  

బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఘటన నిజామాబాద్, బతుకమ్మ :  కాళ్లకు సంకెళ్లు వేసిన ఓవ్యక్తితో హెడ్ కానిస్టేబుల్ వెట్టిచాకిరీ చేయించాడు. ఈఘటన బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. ఓ కేసు విషయమై ఓవ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. కాళ్ళకి సంకెళ్లు వేసిన పోలీసులు అతడితో  స్టేషన్ ను శుభ్రం చేయించారు.