- ప్రభుత్వం ఏం చేస్తుంది..?
- ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తక్షణమే మరమ్మతు పనులు చేయాలి
- బిజెపి జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ కుమార్
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల పరిధిలోని ఇందల్వవాయి నుండి ధర్పల్లి వెళ్లే రోడ్డు మార్గంలో భారీ వర్షాల నేపథ్యంలో గత ఆగస్టు 27వ తారీఖున పాటితాండ వద్ద బిటి రోడ్డు తెగిన విషయం తెలిసిందే.బుధవారం బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ కుమార్,మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ ఆధ్వర్యంలో మోరం పారాల సహాయంతో చదును చేశారు అనంతరం జెసిబి లతో చదును చేశారు.తెగిన రోడ్డుతో ప్రయాణిక ప్రజలకు రాకపోకలకు తీవ్ర ముప్పు ఉండడంతో తమ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డుకు మరమ్మత్తులు చేశామని అన్నారు.చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగినందున ఓకే ఇంటిలో ముగ్గురు అక్క చెల్లెలు చనిపోవడం చాలా బాధాకరమన్నారు.అలాంటి సంఘటనలు జరగకుండా తమ పార్టీ ద్వారా ఈ తెగిన రోడ్డుకు మరమాత్తులు చేయడం జరిగిందని బిజెపి జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ తెలిపారు.ప్రస్తుత ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి ఇదే రోడ్డు మార్గం నుండి దాదాపు 20, సార్లు ప్రయాణం చేశారని కానీ ఇప్పటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.మరోపక్క జిల్లా కలెక్టర్ సైతం మూడు నాలుగు సార్లు ఇదే రోడ్డు మార్గంలో ధర్పల్లి ప్రాంతాలలో వెళ్లడానికి వెళ్లినట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు కూడా నాణ్యత లేకుండా ఇలాంటి రోడ్డు పనులు చేయడం సిగ్గుచేటు అన్నారు. జిల్లా అధ్యక్షులు కులాచార్య దినేష్ కుమార్ వెంటనే సంబంధిత జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బి,డిఈ లతో ఫోన్లో మాట్లాడారు, ఆర్ అండ్ బి మాట్లాడుతూ ఆరు లక్షల యాబై వేల నిధులు మంజూరు కొరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని జిల్లా అధ్యక్షులు కులచారి దినేష్ కుమార్ కు తెలిపారు. త్వరలోనే పనులను వేగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం నిధులను వెంటనే విడుదల చేస్తే రోడ్డు మరమ్మత్తు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.త్వరగా తిను లను చేయించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ,మాజీ మండల అధ్యక్షులు నాయుడు రాజన్న, శేఖర్ సీనియర్ నాయకులు శ్రావణ్, అశోక్,తదితరులు పాల్గొన్నారు.
