ఐక్యతను చాటిచెప్పే విధంగా భారీ తిరంగా ర్యాలీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఇందూర్ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా నుండి తిలక్ గార్డెన్ వరకు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతు భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో తల్లి భారతవని దాస్య సంకెళ్లు తెంచడానికి ఎందరో వీరులు తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా అర్పించడం జరిగిందని వారి బలిధానాల కారణంగా మనం ఈ రోజు స్వేచ్ఛ...