బతుకమ్మ: బిచ్కుంద : మహ్మద్ ప్రవక్తపై యతి నర్సింగానంద్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ముస్లింలు శనివారం ఉదయం శాంతియుతంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం యువకులు, ప్రజలు మాట్లాడుతూ అన్ని మతాల వారు సమానంగా మన దేశంలో జీవిస్తారని, లౌకిక దేశంలో అన్మదమ్ముల్లా కలిసి ఉంటున్నామన్నారు. ఏ మతాన్ని కించ పరిచే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. ముస్లిం మనోభావాలను దెబ్బ తీసే విధంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యతి నర్సింగానంద్ వ్యాఖ్యలపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందించాలన్నారు. అతనిపై వెంటనే కేసులు నమోదు చేసి, ఈ తరహా వ్యాఖ్యలు ఎవరూ చేయకుండా కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. మస్జిదే ఆబేదీన్ నుండి ర్యాలీ ప్రారంభించి ఎమ్మార్వో కార్యాలయంలో అనంతరం పోలీసు స్టేషన్ లో నర్సింగానంద్ పై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో వివిధ మండలాల, గ్రామాల యువకులు పాల్గొన్నారు.
