Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 September 2025, 6:10 pm Posted by : ramakrishna

ఆరోగ్య మహిళా శక్తివంతమైన కుటుంబం

  • పర్యవేక్షించిన జిల్లా వైద్య అధికారులు రమేష్, అశోక్

ఆర్మూర్, బతుకమ్మ: పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆర్మూర్ ఆధ్వర్యంలో  ఆరోగ్య మహిళ శక్తివంతమైన కుటుంబము కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగిందని డిప్యూటీ డీ ఏం హెచ్ వో రమేష్ అన్నారు. ఇట్టి కార్యక్రమంలో 108 మందికి మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది గైనిక్ ప్రాబ్లమ్స్, దంత సమస్యలు, కంటి సమస్యలు పరీక్షించడం తగిన సలహాలు సూచనలు మందులు ఇవ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.  కార్యక్రమంలో గైనిక్ వైద్య అధికారిని గీత స్థానిక వైద్యాధికారిని శ్రేయ, దంత వైద్యాధికారి సతీష్, ఆఫ్టాల్మ భుజంగ రెడ్డి, వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది ఆరోగ్యానికి కావలసిన తగిన సలహాలు సూచనలు మందులు ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని డిస్టిక్ ఎమ్మానైజేషన్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ పర్యవేక్షించడం జరిగింది.  కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ సాయి స్థానిక నర్సింగ్ ఆఫీసర్స్ రత్నకుమారి పారామెడికల్ సిబ్బంది సూపర్వైజర్ శాంత, హెల్త్ అసిస్టెంట్ ఆనంద్, సురేష్, కృష్ణ, మల్లేశ్వరి, రజిత, రేణుక, కమల, విజయ, రాజవ్వ, శ్యామల, స్వాతి, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.

A healthy woman is a powerful family