Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 October 2024, 7:27 pm Posted by : ramakrishna

ఆర్థిక సహాయం అందజేసిన మిత్ర బృందం

 బతుకమ్మ దుబ్బాక  ప్రతినిధి : సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధికి చెందిన 13 వార్డులో  బెల్లె కనకరాజు ఇటీవల మరణించారు. విషయం తెలుసుకొని శుక్రవారం వారి కుటుంబ సభ్యులను (ఎస్ఎస్ సి 2007–08)బ్యాచ్ మిత్రులు పరామర్శించారు.అలాగే మిత్రులందరి సహకారం తో కనకరాజు కు సంబంధించిన దినవారంకు అయ్యే సంబంధించిన పూర్తి ఖర్చులను తన తోటి మిత్రులందరు కలిసి భరిస్తున్నామన్నారు. చిన్న నాటి బాల్యమిత్రుడు బెల్లె కనకరాజు అకాల మరణం పొందడం చాలా బాధాకరమన్నారు.నిరుపేద కుటుంబానికి చెందిన బెల్లె కనకరాజు కుటుంబాన్ని దాతలు గాని ఆయా పార్టీల నాయకులు గాని పెద్దమనసు చేసుకొని వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా వారి మిత్రులు కోరుతున్నామన్నారు.