Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 September 2025, 4:17 pm Posted by : ramakrishna

కామారెడ్డిలో ఐదుగురు మంత్రుల బృందం

  • 15న జరిగే బిసీ డిక్లరేషన్ భారీ బహిరంగం సభ స్ధలం పరిశీలన
  • లక్ష మంది బిసీలతో సభను విజయవంతం చేయాలని పిలుపు

 

కామారెడ్డి, బతుకమ్మ : బీసీలకు ఇచ్చిన హమీల అమలు కోసం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, వాకాటి శ్రీహరి లు అన్నారు. ఆదివారం  కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 15న జరిగే భారీ బహిరంగ సభ (ఇందిరాగాంధీ స్టేడియం)లో స్థల పరిశీలన చేసారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యేలు మధన్ మోహన్, లక్ష్మికాంతారావులతో కలిసి మంత్రుల బృందం మాట్లాడుతు…. గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హమీ లో ప్రధానమైన బీసీ డిక్లరేషన్ పై అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు.

A group of five ministers in Kamareddy

ఆ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ ఉందన్నారు. కేంద్రం బిల్లును పెండింగ్ లో పెట్టిన దానిని అసెంబ్లీలో తీర్మాణం ప్రకారం అమలు చేసి తీరుతామని అన్నారు. కేంద్రం బీసీలపట్ల ఉన్న వివక్షతను ఎండగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. కామారెడ్డి వేదికగా ప్రజలకు ఇచ్చిన హమీని అమలు చేస్తున్నామని అందుకే లక్ష మందితో సంబరాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మళ్లిఖార్జున్ ఖర్గేలతో పాటు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, సిద్ధ రామయ్యలు హాజరు అవుతారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలోనే బిసీలకు రిజర్వేషన్ అమలు చేసి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి నిరూపించుకుంటుందన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరగనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.