Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 December 2024, 12:45 pm Posted by : ramakrishna

గడ్డం వెంకటస్వామికి ఘన నివాళి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్లో ఆదివారం  అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, నుడా ఛైర్మన్ కేశ వేణు, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ముత్తెన్న, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్ తదితరులు వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సుధీర్ఘకాలం పాటు కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన వెంకటస్వామి దళిత, బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఆయన సేవలను గుర్తిస్తూ నిరంతరం స్మరించుకునేలా ప్రభుత్వం అధికారికంగా జయంతి, వర్ధంతి వేడుకలను నిర్వహిస్తోందని అన్నారు. స్వర్గీయ వెంకటస్వామి అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వెంకటస్వామితో తనకు గల అనుబంధాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వర్ధంతి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.