హక్కుల కోసం పోరాడిన మహనీయుడు

బతుకమ్మ,మోర్తాడ్: సమాజ కోసం సమర్పణ హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయుడు మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ అని బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి అన్నారు. జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని మూర్తుల మండల కేంద్రంలో ని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన చూపిన మార్గం నూతన భారత నిర్మాణానికి మార్గదర్శకమని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.