డీఈవోను సన్మానించిన ‘మోడల్’ ప్రిన్సిపాళ్లు
నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అశోక్ ను మోడల్ స్కూల్, కళాశాలల ప్రిన్సిపాళ్లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. ఆదర్శ పాఠశాల, కళాశాలల్లో విద్యాబోధన బాగుండడంతో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని, ఈ ఏడాది సైతం ఇంటర్ లో ఉత్తమ ఫలితాలు వచ్చే కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో నోడల్ అధికారులు సుధారాణి, ప్రవీణ్ కుమార్, డాక్టర్ దశరథ్ యాదవ్, శ్యాం కుమార్, ఫెరోజ్ ఖాన్ , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.